Royal Enfield | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారతీయ మోటర్ సైకిల్ యూజర్లకు అప్ డేటెడ్ వర్షన్ మోటార్ బైక్ ‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)’ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. 350సీసీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ నూతన ఫీచర్లు, కలర్ స్కీమ్స్‌లో వస్తోంది.
ఇండికేటర్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్‌తోపాటు స్టాండర్డ్ న్యూ ఎల్ఈడీ హెడ్ లైట్ తో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తున్నదని భావిస్తున్నారు. న్యూ కలర్స్ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ మోటరు సైకిల్ లో డ్యుయల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్లు, సింగిల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్లు కొనసాగుతాయని తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటారు సైకిల్ 349సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ జే సిరీస్ ఇంజిన్ తో వస్తుందని సమాచారం. ఈ ఇంజిన్ గరిష్టంగా 6100 ఆర్పీఎం వద్ద 20.21 పీఎస్, 4000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. అలాగే 5-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుందని చెబుతున్నారు.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, అనలాగ్ స్పీడో మీటర్, స్మాల్ ఎల్సీడీ స్క్రీన్ మీద ఒడో మీటర్, ఫ్యుయల్ లెవల్స్, ట్రిప్ మీటర్స్ గురించి సంకేతాలిస్తూ ఉంటుంది. ఆప్షనల్ ట్రిప్పర్ నేవిగేసన్ పాడ్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, కాల్ అలర్ట్స్ అందిస్తుంది. 41ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, 6-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్, 300 ఎంఎం డిస్క్ బ్రేక్ ఎట్ ఫ్రంట్, రేర్ లో 153 ఎంఎం డ్రమ్ (సింగిల్ చానెల్ ఏబీఎస్), 270ఎంఎం డిస్క్ (డ్యుయల్ చానెల్ ఏబీఎస్), 19 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల రేర్ స్పోక్ / అల్లాయ్ వీల్స్ విత్ 100 సెక్షన్ ఫ్రంట్ అండ్ 120 సెక్షన్ రేర్ టైర్లతో వస్తోంది.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటారు సైకిల్ ఇంట్రడ్యూసరీ ధర రూ.1,93,080 – 2,24,755 (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. అప్ డేటెడ్ బైక్ ధర తదుపరి రూ.3000-4000 పెరుగుతుందని చెబుతున్నారు. హోండా సీబీ350, హోండా హెచ్’నెస్ సీబీ350, హీరో మావ్రిక్ 440, జావా 350, జావా 42, బైనెల్లి ఇంపీరియల్ 400, రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 మోటారు సైకిళ్లతో అప్ డేటెడ్ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ పోటీ పడుతుందని తెలుస్తోంది.
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !
Hyundai Venue | హ్యుండాయ్ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ ఎస్ (ఓ)+.. ధరెంతంటే..?!
World Bank – India | ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే..!