Royal Enfield Himalayan | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎచిర్ మోటార్స్ (Eicher Motors) అనుబంధ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారత్ మార్కెట్లో తన అడ్వెంచర్ టూరిస్ట్ బైక్ ‘హిమాలయ్ (Himalayan)’ శుక్రవారం ఆవిష్కరించింది. అన్ని రకాల రోడ్లపైనా దీంతో ప్రయాణించొచ్చు. దీని ధర రూ.2.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ధరలు డిసెంబర్ 31 వరకే అందుబాటులో ఉంటాయి. ‘రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)’ బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మోటో వర్స్ -2023 మోటార్ సైక్లింగ్ ఫెస్టివల్లో ఆవిష్కరించిన ‘హిమాలయన్’ బుల్లెట్ మూడు వేరియంట్లు – బేస్ (Base), పాస్ (Pass), సమ్మిట్ (Summit), ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన హిమాలయన్ (Himalayan) బైక్‌లో సమూల మార్పులు తెచ్చింది. న్యూ452సీసీ లిక్విడ్-కూల్డ్ డీవోహెచ్సీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తున్నది. 5500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 40 ఎన్ఎం టార్క్, 8000 ఆర్పీఎం వద్ద 39.5 హెచ్‌పీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌తో అనుసంధానించిన స్లిప్పర్ క్లచ్ అండ్ అసిస్టెన్స్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటాయి.
వెనుక ప్రీ లోడ్ అడ్జస్టబుల్ మోనో సాక్‌తో కూడిన సస్పెన్షన్ సిస్టమ్, ముందు వైపు 200 ఎంఎంతో కూడిన 43 ఎంఎం యూఎస్డీ ఫోర్క్స్ ఉన్నాయి. హ్యాండిల్ బ్రేకింగ్ కోసం ఫ్రంట్‌లో 320 ఎంఎం సింగిల్ డిస్క్, వెనుక 270 ఎంఎం డిస్క్ ఉన్నాయి. ఫ్యుయల్ ట్యాంక్ 17 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. 17- అంగుళాల బ్యాక్ వీల్స్, 21- అంగుళాల ఫ్రంట్ వీల్స్ విత్ డ్యుయల్ పర్పస్ టైర్స్ అమర్చారు.
గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానించే 4-అంగుళాల సర్క్యులర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రైడ్ బై వైర్, స్పోక్డ్ వీల్స్, హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్, డ్యూయల్ పర్పస్ రేర్ టెయిల్ లైట్స్, డబుల్ యాజ్ టర్న్ ఇండికేటర్లు, రైడింగ్ మోడ్స్, ఎల్ఈడీ లైటింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
వేరియంట్ – కలర్ ఆప్షన్ – ధర
బేస్ – కాజా బ్రౌన్ – రూ.2.69 లక్షలు
పాస్ – స్లేట్ హిమాలయన్ సాల్ట్ – రూ.2.74 లక్షలు
పాస్ – స్లేట్ హిమాలయన్ పప్పీ బ్లూ – రూ.2.74 లక్షలు
సమ్మిట్ – కామెట్ వైట్ – రూ.2.79 లక్షలు
సమ్మిట్ – హన్లే బ్లాక్ – రూ.2.84 లక్షలు