Home Loan | సంప్రదాయ గృహ రుణానికి భిన్నంగా ఇటీవలికాలంలో రివర్స్ మార్ట్గేజ్ లోన్లు స్థిరాస్తి మార్కెట్లో పాపులారిటీని సంతరించుకుంటున్నాయి. వృద్ధాప్యంలో ఏ ఆదాయం లేని ఇంటి యజమానులకు నిజంగా ఇవి ఆర్థిక భరోసానే కల్పిస్తున్నాయి. నగదు అవసరాలు లేదా ఇతరత్రా జీవన వ్యయాల కోసం ఉన్న ఇంటిని అమ్ముకొని రోడ్డునపడకుండా ఉన్న ఇంట్లోనే సంతోషంగా ఉంటూ ఆర్థిక భద్రతను పొందేలా ఈ లోన్లు సీనియర్ సిటిజన్లకు కలిసొస్తున్నాయి.
ఈ హెచ్ఈసీఎం పథకం అత్యంత ఆదరణ కలిగినది. రివర్స్ మార్ట్గేజ్ వెసులుబాటు విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. 62, ఆపై వయసు కలిగినవారి కోసం దీన్ని రూపొందించారు. ఇంటి ఈక్విటీలో కొంత భాగాన్ని నగదులోకి మార్చుకోవచ్చు.
ఈ సదుపాయాన్ని ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందిస్తున్నాయి. అధిక విలువ కలిగిన ఇంటి యజమానుల కోసం దీన్ని డిజైన్ చేశారు. అయితే హెచ్ఈసీఎంకు అర్హత లేకపోతేనే దీనికి అర్హులు.