హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ సొనాట సాఫ్ట్వేర్..హైదరాబాద్‌లో మరో నూతన సెంటర్‌ను నెలకొల్పింది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వంశీరాం టెక్‌పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్, లైఫ్సెన్సెస్లకు హైదరాబాద్ జీసీసీ హబ్‌గా మారిందని, అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన తదితర విభాగాలు సమతుల్యంగా సాగుతున్నాయన్నారు. కొత్తగా రాష్ట్రంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. కంపెనీ ఎండీ, సీఈవో సమీర్ ధీర్ మాట్లాడుతూ..ఈ నూతన సెంటర్‌తో వచ్చే మూడు నుంచి ఐదేండ్లకాలంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.