Retail Inflation | ఆహార వస్తువుల ధరల పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్బణం తిరిగి పెరిగింది. అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతం పెరిగింది. అంతకు ముందు సెప్టెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.49 శాతం మాత్రమే. 2023 అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతం మాత్రమే. సెప్టెంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 9.24 శాతం కాగా, అక్టోబర్ నెల నాటికి 10.87 శాతానికి పెరిగింది.
సరిగ్గా ఏడాది క్రితం 2023 అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.61 శాతంగా నమోదైంది. పట్టణ ద్రవ్యోల్బణం 5.62 శాతంగా నమోదైతే, గ్రామీణ ద్రవ్యో్ల్బణం 6.68 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇటీవల ద్రవ్య పరపతి సమీక్ష నిర్వహించిన ఆర్బీఐ కీలక స్వల్పకాలిక రుణాల వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. వడ్డీరేట్ల తగ్గింపునకు 4 శాతం ఉండాలి.