హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యోగాలకు సంసిద్ధులను చేసే బాధ్యత పరిశ్రమలదేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
పీఎస్ఆర్ టెక్‌హబ్ సంస్థ పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బేగంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ‘ఏఐ హబ్’ పేరుతో ప్రత్యేక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వచ్చే 2 నెలల్లో రీ-సిల్లింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే పిఎస్ఆర్ టెక్‌హబ్ దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నదని కంపెనీ డైరెక్టర్ పి.నమ్యుత తెలిపారు.