ముంబై, అక్టోబర్ 1: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ గోవిందరాజన్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు గోవిందరాజన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారని, డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపినట్లు అరబిందో ఫార్మా శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. 2021 డిసెంబర్ 31న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ రాజీనామా అమలులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే తమ ఏపీఐ వ్యాపార విభాగానికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎస్ దామోదరన్ నియామకానికి బోర్డు అంగీకారం తెలిపినట్లు ఆరబిందో ఫార్మా ప్రకటించింది.