హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్లాస్టిక్ నీటి ట్యాంకులు, పైపులు, ఫిట్టింగ్స్ తయారీలో ప్రముఖ సంస్థగా ఉన్న ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ తయారీ కేంద్రాన్ని పూర్తిగా రెన్యువబుల్ ఎనర్జీతోనే నడిపిస్తున్నది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 52 ఎకరాల్లో ఉత్పాదక కేంద్రం ఉన్నది.
దీని నెలవారీ ఉత్పత్తి సామర్థ్యం 20 కోట్ల లీటర్ల వాటర్ ట్యాంకులు. కాగా, నాగ్‌పూర్ ప్లాంట్ 100 శాతం రెన్యువబుల్ ఎనర్జీ ఆధారిత మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌గా మారడానికి సమీపంలోగల నండూర్బార్లోని రెండు విండ్మిల్స్లో తయారైన గ్రీన్ ఎనర్జీనే దోహదం చేసినట్టు సంస్థ తెలిపింది.