Jio Book | న్యూఢిల్లీ, జూలై 31: రిలయన్స్ రిటైల్ ఓ సరికొత్త జియోబుక్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. అన్ని వర్గాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన దీని ధర రూ.16,499. ఈ 4జీ-ఎల్టీఈ ఆధారిత ల్యాప్‌టాప్ చాలా తేలిక. వీలుంటే జేబులోనూ పెట్టుకోవచ్చు. దేశీయ తొలి లెర్నింగ్ బుక్‌గా చెప్తున్న ఈ ల్యాప్‌టాప్.. ఆగస్టు 5 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండనున్నది. రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు, అమెజాన్.ఇన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కాగా, ఇప్పటికే జియో భారత్ ఫోన్లను రూ.999 ధరకే రిలయన్స్ పరిచయం చేసిన సంగతి విదితమే. దీని కోసం కేవలం రూ.123 ప్లాన్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ డాటా కంపెనీ ఇస్తున్నది. ఇక గత ఏడాది కూడా ఓ జియోబుక్‌ను తీసుకువచ్చింది.
జియోబుక్ విశేషాలు