న్యూఢిల్లీ, డిసెంబర్ 14: డాటా డౌన్‌లోడ్‌లో రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. గత నెలకుగాను సెకన్‌కు 24.1 మెగాబైట్స్ డాటా డౌన్‌లోడ్‌తో అగ్రస్థానంలో కొనసాగిందని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి. సరాసరి ఈ రెండు సంస్థల కంటే జియో వేగం పది శాతం అధికమని పేర్కొంది. మరోవైపు, డాటా అప్‌లోడ్‌లో మాత్రం వొడాఫోన్ ఐడియా టాప్ స్థానంలో కొనసాగుతున్నది. గడిచిన ఐదు నెలలుగా ఇదే స్థానంలో ఉండటం విశేషం. సెకన్‌కు 8 మెగాబైట్స్ డాటా అప్లోడ్ అయింది. అలాగే జియో 7.1 మెగాబైట్స్, ఎయిర్టెల్ 5.6 మెగాబైట్స్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.