శనివారం 06 జూన్ 2020
Business - May 08, 2020 , 09:04:44

2.3 శాతం వాటా అమ్మేసిన జియో.. విస్టా 11,367 కోట్ల‌ పెట్టుబుడులు

2.3 శాతం వాటా అమ్మేసిన జియో..  విస్టా 11,367 కోట్ల‌ పెట్టుబుడులు


హైద‌రాబాద్‌: రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియో మ‌ళ్లీ 2.3 శాతం వాటాను అమ్మేసింది.  అమెరికాకు చెందిన విస్టా ఈక్వెటీ కంపెనీ ఆ షేర్ల‌ను కొన్న‌ది. విస్టా కంపెనీ సుమారు 11,367 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ది. జియోలో గ‌త కొన్ని రోజుల్లోనే పెట్టుబ‌డులు పెట్టిన మూడ‌వ కంపెనీగా విస్టా నిలిచింది.   ఇటీవ‌లే ఫేస్‌బుక్‌, సిల్వ‌ర్ లేక్ సంస్థ‌లు జియోలో పెట్టుబ‌డి పెట్టిన విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్ 43,534 కోట్లు, సిల్వ‌ర్ లేక్ 5656 కోట్లు జియోలో పెట్టుబడులు పెట్టాయి. ప్ర‌పంచ దేశాల‌కు చెందిన మేటి టెక్నాల‌జీ సంస్థ‌ల నుంచి కేవ‌లం రెండు వారాల్లోనే జియో ఫ్లాట్‌ఫాం మొత్తం  60,596.37 కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించింది. గ‌త ప‌దేళ్ల నుంచి టెక్నాల‌జీ కంపెనీల్లో విస్టా పెట్టుబడులు పెడుతున్న‌ది.logo