నిరాశపరిచిన రిలయన్స్.. క్యూ1లో 22 శాతం తగ్గిన ప్రాఫిట్
చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.20,946 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదుచేసుకున్నది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.26,994 కోట్ల లాభంతో పోలిస్తే 22 శాతం తగ్గుదల నమోదు చేసుకున్నది.
- రూ.20,946 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ, జూలై 17 : చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.20,946 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదుచేసుకున్నది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.26,994 కోట్ల లాభంతో పోలిస్తే 22 శాతం తగ్గుదల నమోదు చేసుకున్నది. ఏషియన్ పెయింట్స్‌లో షేర్లను విక్రయించడంతో ఒకేసారి భారీగా రూ.8,942 కోట్ల ఆదాయం సమకూరడంతో గతేడాది రికార్డు స్థాయి లాభాలను ఆర్జించిది సంస్థ. చమురు నుంచి కెమికల్స్, టెలికాం రంగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే ఈ మాత్రమైన లాభాలను నమోదు చేసుకున్నట్టు వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 24.5 శాతం అధికమై రూ.3,40,257 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
జియో లాభం 7,764 కోట్లు
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అంచనాలకుమించి రాణించింది. జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,764 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.7,110 కోట్ల లాభంతో పోలిస్తే 9.2 శాతం వృద్ధిని కనబరిచింది. మార్కెట్ వాటా పెరగడం, కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం అధికమవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11.8 శాతం అందుకొని రూ.39,173 కోట్లకు చేరుకున్నది. సరాసరిగా ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం 3.3 శాతం అధికమై రూ.215.6కి చేరుకోవడం కంపెనీకి కలిసొచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థకు 53.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. డిజిటల్ కామర్స్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఇతర రంగాలు నేలచూపులు చూస్తున్నదని, ముఖ్యంగా రిటైల్ రంగంలో వృద్ధి ఫ్లాట్‌గా ముగిసినట్టు పేర్కొంది.
- గడిచిన త్రైమాసికంలో సంస్థ రూ.38, 682 కోట్ల పెట్టుబడులు పెట్టగా, రూ.41, 254 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.
- అలాగే జూన్ చివరినాటికి కంపెనీకి రూ.1,22,914 కోట్ల రుణాలు ఉన్నాయి.
- రిలయన్స్ రిటైల్ విభాగం రూ.90,408 కోట్ల ఆదాయంపై రూ.2,806 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. దేశంలో అతిపెద్ద ఐపీవోలలో ఇది కూడా ఒకటికానున్నది.
– ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

