RIL | భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా ఆర్ఐఎల్.. ప్రపంచంలో 44వ స్థానం
భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. బుధవారం విడుదలైన 2023 హురున్ గ్లోబల్-500 జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆర్ఐఎల్ 198 బిలియన్ డాలర్ల విలువతో 44వ స్థానాన్ని సంపాదించింది. అయితే 2022తో పోలిస్తే ఈ కంపెనీ విలువ గత ఏడాది 2023లో 2 శాతం తగ్గినందున పది స్థానాల్ని కోల్పోయింది.
- 2023 హురున్ గ్లోబల్-500 జాబితా
RIL | న్యూఢిల్లీ, జనవరి 31: భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. బుధవారం విడుదలైన 2023 హురున్ గ్లోబల్-500 జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆర్ఐఎల్ 198 బిలియన్ డాలర్ల విలువతో 44వ స్థానాన్ని సంపాదించింది. అయితే 2022తో పోలిస్తే ఈ కంపెనీ విలువ గత ఏడాది 2023లో 2 శాతం తగ్గినందున పది స్థానాల్ని కోల్పోయింది. టాప్-100లో మొత్తం మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. వివరాలు&
- ఆర్ఐఎల్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 60వ స్థానంలోనూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 68వ స్థానంలోనూ ఉన్నాయి.
- 2023లో టీసీఎస్ షేరు 14 శాతం పెరగడంతో 158 బిలియన్ డాలర్ల విలువతో 5 స్థానాల్ని మెరుగుపర్చుకుంది.
- మాతృసంస్థ హెచ్డీఎఫ్సీ విలీనం కావడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏకంగా 43 మెట్లు ఎక్కి 68వ స్థానాన్ని అందుకుంది.
- హురున్ గ్లోబల్ టాప్ 500 ర్యాంకింగ్స్‌లో కొత్తగా చేరిన భారతీయ కంపెనీల్లో టైటాన్, సన్‌ఫార్మాలు ఉన్నాయి.
- అయితే విలువలు క్షీణించిన కారణంగా జాబితా నుంచి 48 భారతీయ కంపెనీలు వైదొలిగాయి. ఇందులో అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్‌లు ఉన్నాయి.
- మొత్తం టాప్ 500 కంపెనీల్లో భారత్ కంపెనీలు 18 మాత్రమే ఉన్నాయి. అధిక విలువకలిగిన కంపెనీలు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఒక ర్యాంక్ కోల్పోయి ఆరవ స్థానంలో నిలిచింది.
- ప్రపంచ చరిత్రలో తొలిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల విలువను ఐదు కంపెనీలు అందుకున్నాయని హురున్ తెలిపింది. అవి..యాపిల్, మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ), అమెజాన్, సెమికండక్టర్స్ కంపెనీ ఎన్విడియాలు. జాబితాలో ఇవి వరుసగా తొలి ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి.
- సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్వేర్ చాట్‌జీపీటీ కారణంగానే మైక్రోసాఫ్ట్, ఎన్విడియాల విలువ గణనీయంగా పెరిగింది. చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు చేయడం, ఏఐకి అవసరమైన సెమీకండక్టర్స్‌ను ఎన్విడియా సరఫరా చేస్తుండటం ఇందుకు కారణం.
- తైవాన్‌కు చెందిన మరో సెమీకండక్టర్ కంపెనీ టీఎస్ఎంసీ 512 బిలియన్ డాలర్ల విలువతో టాప్-10లో చోటు సంపాదించింది.
- కొత్తగా వెయిట్టాస్ ఔషధం జెప్బౌండ్ను ప్రవేశపెట్టిన ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ సైతం 526 బిలియన్ డాలర్ల విలువతో తొలిసారిగా టాప్-10లోకి అడుగుపెట్టింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

