హైదరాబాద్, జూలై 13: ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రిలయన్స్ ‘డిజిటల్ ఇండి యా సేల్’ వచ్చేసింది. ఆకర్షణీయమైన ఆఫ ర్లు, డిస్కౌంట్లతో శుక్రవారం నుంచి మొదలవుతున్నది. 3 రోజులపాటు కొనసాగే ఈ మెగా సేల్ సందర్భంగా ఆయా క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్సహా సులభతర నెలసరి వాయిదాలు, ఫైనాన్సింగ్ సదుపాయాలనూ తమ కస్టమర్ల కోసం రిలయన్స్ డిజిటల్ సిద్ధం చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్లతోపాటు మై జియో స్టోర్లలో ఆదివారం వరకు ఈ ఆఫర్ సేల్స్ అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు కొనుగోలుదారులు www.reliancedigital.in సందర్శించవచ్చు.