Redmi K50i | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ.. తన రెడ్ మీ కే50ఐ (Redmi K50i) ఫోన్ మీద రాయితీ ప్రకటించింది. గతేడాది జూలైలో ఆవిష్కరించిన ఫోన్ మీద డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు తీసుకొచ్చింది. రెడ్ మీ కే సిరీస్ ఫోన్ రెడ్ మీ కే50ఐ ఫోన్ భారత్ మార్కెట్లో రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.25,999, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.28,999లకు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ట్విట్టర్ వేదికగా రెడ్ మీ తన రెడ్ మీ కే50 ఐ బేస్ వేరియంట్ ఫోన్ రూ.18,999లకు అందిస్తున్నది. అంటే రూ.7,000 డిస్కౌంట్ ప్రకటించింది. టాప్ హై ఎండ్ వేరియంట్ ధర ఇంకా వెల్లడించలేదు.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు మీద కొనుగోలు చేసిన వారికి రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నది. కంపెనీ ఇండియా వెబ్ సైట్, అమెజాన్ వెబ్ సైట్లో ఈ సంగతి ప్రకటించింది.
రెడ్ మీ కే50ఐ ఫోన్ మూడు కలర్స్.. ఫాంటం బ్లాక్, క్విక్ సిల్వర్, స్టెల్త్ బ్లాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2460×1080 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 270 హెర్ట్జ్, 650 నిట్స్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో హెచ్డీఆర్ 10 అండ్ డోల్బీ విజన్‌కు సపోర్ట్‌గా ఉంటది. రెడ్ మీ కే50ఐ ఫోన్ ఆండ్రాయిడ్ 12 విత్ ఎంఐయూఐ 13 వర్షన్ మీద పని చేస్తుంది.
64 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐఎస్ఓసీఈఎల్ఎల్ జీడబ్ల్యూ1 ప్రైమరీ సెన్సర్ తోపాటు ట్రిపుర్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ మాక్రో షూటర్ అలాంగ్ సైడ్ ఎలిప్టికల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
5080 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 67 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్షన్ కూడా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూ టూత్ వీ5.3, జీపీఎస్ / ఏ-జీపీఎస్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.