Redmi A4 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్మీ తన రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ హెచ్డీ+ డిస్ ప్లేతోపాటు 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ రెండు వేరియంట్లు – 4జీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ రూ.8,4999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,4999లకు లభిస్తాయి. స్టారీ బ్లాక్, స్పార్కిల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. ఆన్లైన్లో అమెజాన్ డాట్ ఇన్, ఎంఐ డాట్ కామ్ల్లో లభిస్తుంది. ఈ నెల 27 నుంచి ఆథరైజ్డ్ రిటైల్ స్టోర్లలో సేల్స్ ప్రారంభం అవుతాయి.
రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తోపాటు 720×1600 పిక్సెల్స్ రిజొల్యూషన్తో 6.88 – అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో పని చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.