BSNL | ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత సంచార్ నిమగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా తక్కువ ధరకు సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నది. గతంలో ప్రతి ఇంట్లో బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉండేది. ఇటీవల కొంతకాలంగా రెండు ప్రైవేటు టెలికాం కంపెనీల హవా కొనసాగుతున్నది. ఆయా కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ ధర పెంచుతుండడంతో మళ్లీ యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు దృష్టి సారిస్తున్నది. దాంతో ప్రభుత్వ రంగ సంస్థ సైతం తక్కువ ధరకు, అధిక వ్యాలిడిటీతో ప్లాన్స్‌ను తీసుకువస్తున్నది. ఈ క్రమంలోనే కొత్తగా చౌక ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ.198కే 40 రోజుల వ్యాలిడిటీ ఉండనున్నది.
ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో ప్రతి రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా పొందుతారు. అంటే 40 రోజుల పాటు డేటా పొందుతారు. 2జీబీ డేటా ముగిసిన తర్వాత 40కేబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సమాచారం ఇచ్చింది. ఈ ప్లాన్ డేటా యూజర్లకు మాత్రమే. ఎందుకంటే ఈ ప్లాన్‌లో కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఇదిలా ఉండగా.. బీఎస్ఎన్ఎల్ సాయుధ దళాల ధైర్యసాహసాలను గౌరవించేందుకు ప్రత్యేక రీచార్జ్ ఆఫర్‌ని ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ గౌరవార్థం ఈ ఆఫర్‌ని తీసుకువచ్చింది. ఆ ప్యాక్‌లో ఓ యూజర్ రూ.1,499తో రీచార్జ్ చేస్తే.. మొత్తంలో 2.5శాతం రక్షణశాఖకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటు యూజర్లకు సైతం 2.5శాతం క్యాష్‌బ్యాక్ తిరిగి పొందుతారు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు చెల్లుబాటు కానున్నది.