హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ షోరూంలలో రియల్మీ సరికొత్త 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని మాదాపూర్ స్టోర్లో సినీనటి శివానీ రాజశేఖర్ ఈ ఫోన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ రేతినేని మాట్లాడుతూ..కొత్త టెక్నాలజీ, కొత్త మాడళ్లను ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ సెలెక్ట్ మొబైల్స్ ముందువరుసలో ఉంటుందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ తాజాగా రియల్మీ సీ67 5జీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఉన్న సెలెక్ట్ స్టోర్లలో ఈ ఫోన్ లభించనున్నదన్నారు. 6.72 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగిన ఈ 5జీ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమన్సిటీ 6100 ప్లస్, ఆక్టా కోర్, 2.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 50+2 మెగాపిక్సెల్ కెమెరా, ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 4జీబీ+128జీబీ/6జీబీ+128జీబీ కెపాసిటీతో లభించనున్నది. ఈ ఫోన్ ధర రూ. 13,999గా నిర్ణయించింది.