Realme P3 Pro 5G | ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ పీ3 ప్రో 5జీ ఫోన్ (Realme P3 Pro 5G) విక్రయాలు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. గత వారం భారత్ మార్కెట్లో రియల్మీ పీ3ఎక్స్ 5జీ (Realme P3x 5G)తోపాటు రియల్మీ పీ3 ప్రో 5జీ (Realme P3 Pro 5G) ఫోన్‌ను రియల్మీ (Realme) ఆవిష్కరించింది. రియల్మీ పీ3 ప్రో 5జీ ఫోన్ మూడు ర్యామ్, స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. రియల్మీ పీ3 ప్రో 5జీ ఫోన్ 1.5కే రిజొల్యూషన్‌తోపాటు అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్, 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీపై పని చేస్తుందీ ఫోన్.
రియల్మీ పీ3 ప్రో 5జీ (Realme P3 Pro 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 23,999తో ప్రారంభమవుతుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 12జీబీ ర్యామ్ విత్ 256జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999 పలుకుతుంది. ఈ ఫోన్ గెలాక్సీ పర్పుల్ (Galaxy Purple), నెబులా గ్లో (Nebula Glow), శాటర్న్ బ్రౌన్ (Saturn Brown) రంగుల్లో లభిస్తుంది. రియల్మీ పీ3 ప్రో 5జీ (Realme P3 Pro 5G) ఫోన్ రియల్మీ యూఐ 6.0 (Realme UI 6.0) బేస్డ్ ఆండ్రాయిడ్ 15 వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 450పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.83-అంగుళాల 1.5కే (1,472×2,800 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది.
రియల్మీ పీ3 ప్రో 5జీ (Realme P3 Pro 5G) ఫోన్ కంపెనీ వెబ్సైట్, ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్‌లో విక్రయిస్తోంది. సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2,000, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.2,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
రియల్మీ పీ3 ప్రో 5జీ (Realme P3 Pro 5G) సోనీ ఐఎంఎక్స్ 896 సెన్సర్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమరా ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 + ఐపీ69 రేటింగ్స్ కలిగి ఉంది. ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ ఎరేజ్ 2.0, ఏఐ మోషన్ డెబ్లర్, ఏఐ రీఫ్లెక్సన్ రిమూవర్ వంటి ఏఐ బేస్డ్ ఫీచర్లు ఉన్నాయి.