Realme Neo 7 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నియో 7 (Realme Neo 7) ఫోన్ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 + చిప్ సెట్ తో వస్తున్న రియల్మీ నియో 7 (Realme Neo 7) ఫోన్ 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా ఉంటుంది. 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 7,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు మూడు రంగుల్లో లభిస్తుంది. త్వరలో గ్లోబల్ మార్కెట్లతోపాటు భారత్ మార్కెట్లోనూ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
రియల్మీ నియో 7 (Realme Neo 7) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.24 వేలు (2099 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.29 వేలు (2499 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.32 వేలు (2799 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.38 వేలు (3299 చైనా యువాన్లు) పలుకుతుంది. 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.26 వేలకు (2299 చైనా యువాన్లు) లభిస్తుంది. మీటరైట్ బ్లాక్, స్టార్ షిప్, సబ్ మెర్సిబుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
రియల్మీ నియో 7 (Realme Neo 7) ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రియల్మీ యూఐ 6.0 వర్షన్ పై పని చేస్తుంది. 6,000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 6.78 అంగుళాల 1.5 కే (1264×2780 పిక్సెల్స్) 8టీ ఎల్టీపీఓ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ డీడబ్ల్యూఎం డిమ్మింగ్ తోపాటు 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గమట్, 2600 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 + ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ర్యామ్ కెపాసిటీ వర్చువల్గా 16 జీబీ వరకూ, ఒక టిగా బైట్ స్టోరేజీ వరకూ పెంచుకోవచ్చు.
రియల్మీ నియో 7 (Realme Neo 7) ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 కెమెరా విత్ ఓఐఎస్ సపోర్ట్, 8-మెగా పిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. 7700 ఎంఎం స్క్వేర్ వీసీ హీట్ డిసిపేషన్ ఏరియాతోపాటు మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీ కోసం స్కై కమ్యూనికేషన్ సిస్టమ్ 2.0 ఫీచర్ ఉంటుంది. 5జీ, బైదూ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, క్యూజడ్ఎస్ఎస్, నేవిల్ సీ, ఎన్ఎఫ్సీ, వై-ఫై802.11 ఏ/బీ/జీ/ఎన్/ఏసీ/బీఈ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, కలర్ టెంపరేచర్ మీటర్, డిస్టెన్స్ సెన్సర్, లైట్ సెన్సర్, జియో మ్యాగ్నటిక్ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్, ఇన్ ఫ్రా రెడ్ రిమోట్ కంట్రోల్, అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి. డ్యుయల్ స్పీకర్స్ విత్ ఓరియాల్టీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 7000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. సింగిల్ చార్జింగ్ సాయంతో 21 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం, 14 గంటల వీడియో కాలింగ్ టైం ఉంటుంది.