Realme Narzo N53 | చైనా టెక్ దిగ్గజం రియల్మీ (Realme) తన రియల్ మీ నార్జో ఎన్53 (Realme Narzo N53) ఫోన్ 8జీబీ ర్యామ్ వేరియంట్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇప్పటివరకూ రియల్మీ ఫోన్లలో ఇది అత్యంత సన్నటి ఫోన్. ఈ ఫోన్ థిక్ నెస్ 7.49 ఎంఎం మాత్రమే. ఈ లో బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్’లో రియల్మీ ‘డైనమిక్ ఐలాండ్’ వంటి ఫీచర్ తీసుకొస్తుంది. బ్యాటరీ, చార్జింగ్ స్టేటస్‌తో కూడిన నోటిఫికేషన్లు వస్తుంటాయి.
రియల్ మీ నార్జో ఎన్53 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,999లకు లభిస్తుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.11,999లకు లభిస్తుంది. దీపావళి ఆఫర్ కింద ఈ ఫోన్‌పై రియల్మీ రూ.2000 వరకూ బెనిఫిట్ అందిస్తుంది. 4జీబీ ర్యామ్ వేరియంట్ మీద రూ.1000, 6జీబీ ర్యామ్ వేరియంట్ మీద రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది.
న్యూ 8 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్, రూ.1000 కూపన్ లభిస్తుంది. అంటే రియల్ మీ నార్జో ఎన్53 8 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ రూ.9,999లకే లభిస్తాయి. ఈ నెల 25 నుంచి రియల్మీ అధికారిక వెబ్ సైట్, ఈ-కామర్స్ వెబ్ సైట్లలో సేల్స్ ప్రారంభం అవుతాయి.
రియల్మీ నార్జో ఎన్53 ఫోన్ 6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. డిస్ ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజొల్యూషన్, 450 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటది.
యూనిసోక్ టీ 612 ప్రాసెసర్‌తో వస్తున్న ఫోన్ 6 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కలిగి ఉంటది. దీన్ని వర్చువల్ గా 12 జీబీ ర్యామ్ వరకూ పొడిగించవచ్చు. ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ 2 టిగా బైట్స్ వరకూ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్మీ యూఐ 4.0 ఓఎస్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
డ్యుయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటది రియల్మీ నార్జో ఎన్53 ఫోన్. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్స్ డెప్త్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ కెమెరాతో వస్తున్నది.
33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 34 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఫర్ చార్జింగ్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటది.