Realme Narzo 70 Turbo 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ ను త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్మీ నార్జో 70 ప్రో 5జీ, రియల్మీ నార్జో 70 5జీ, రియల్మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లకు రియల్మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) జత కలవనున్నది. నాలుగు ర్యామ్ ప్లస్ నాలుగు స్టోరేజీ ఆప్షన్లలో రానున్నది. గ్రీన్, పర్పుల్, ఎల్లో రంగుల్లో లభిస్తుందీ ఫోన్.
రియల్మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ 12.6 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ సపోర్ట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) ఉంటుంది. ఈ కెమెరా 4096×3072 పిక్సెల్స్ రిజొల్యూషన్ తో కూడిన ఫోటోలను రికార్డు చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తుందని భావిస్తున్నారు.
మార్చిలో ఆవిష్కరించిన రియల్మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999 పలుకుతుంది. 67వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఓలెడ్ స్క్రీన్, ట్రిపుల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది.
రియల్ మీ నార్జో 70 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999లకు లభిస్తాయి. రియల్ మీ నార్జో 70 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ ప్లే, రియల్ మీ నార్జో 70ఎక్స్ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఎల్ సీడీ స్క్రీన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 45 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలతో వస్తున్నాయి.