Realme Narzo 70 Turbo 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇప్పటికే భారత్ మార్కెట్లో ఉన్న రియల్మీ నార్జో 70 ప్రో 5జీ, రియల్మీ నార్జో 70 5జీ, రియల్మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లతో రియల్మీ నార్జో 70 టర్బో 5జీ జత కలుస్తుంది.
మోటార్ స్పోర్ట్ ఇన్ స్పైర్డ్ డిజైన్, న్యూ టర్బో టెక్నాలజీతో రూపుదిద్దుకున్నదీ రియల్మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్. ఇది స్క్వైర్కిల్ మాడ్యూల్ కెమెరాతో వస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. స్పీకర్ గ్రిల్లె, 3.5 ఎంఎం ఆడియో జాక్ కలిగి ఉంటుంది. రియల్మీ నార్జో 70 టర్బో 5జీ ఫోన్ నాలుగు ర్యామ్, నాలుగు స్టోరేజీ వేరియంట్లు- 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. గ్రీన్, పర్పుల్, ఎల్లో కలర్ ఆప్షన్లలో వస్తుందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది.