Realme Narzo 70 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro) ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గతేడాది జూలైలో మార్కెట్లో ఆవిష్కరించిన రియల్మీ నార్జో 60 ప్రో 5జీ (Realme Narzo 60 Pro 5G) ఫోన్ కొనసాగింపుగా రియల్మీ నార్జో 70 ప్రో 5జీ తోపాటు రియల్మీ నార్జో 70 5జీ ఫోన్ ఎప్పుడు ఆవిష్కరిస్తారన్నది వెల్లడించలేదు.
రియల్మీ 12 ప్రో+ 5జీ ఫోన్ను రీ బ్యాడ్జ్ చేసి రియల్మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు.
రియల్మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro) ఫోన్ వచ్చే నెలలో ఆవిష్కరించనున్నది. సెంట్రల్లీ కెమెరా మాడ్యూల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ ఓమ్నీ విజన్ ఓవీ64బీ టెలిఫోటో కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం మరో కెమెరా ఉంటుంది.
రియల్మీ నార్జో 60 ప్రో 5జీ ఫోన్.. 100-మెగా పిక్సెల్ ఓమ్నీ విజన్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 12 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ రూ.29,999లకు లభిస్తున్నాయి.