Realme Narzo 60 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ నార్జో 60 సిరీస్ ఫోన్లు ఈనెల ఆరో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రియల్మీ నార్జో60 5జీ తోపాటు రియల్మీ నార్జో 60 ప్రో 5జీ ఫోన్ కూడా లాంచ్ చేస్తుంది.
వచ్చేవారం నుంచి రియల్ మీ నార్జో60 సిరీస్ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. అమెజాన్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ బుక్ చేసుకున్న కస్టమర్లకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది రియల్మీ. ఇక రెండు మోడల్ ఫోన్లు 12 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఆప్షన్‌తో వస్తున్నాయని తెలుస్తున్నది.
రియల్మీ నార్జో60 5జీ సిరీస్ ఫోన్లు కాస్మిక్ బ్లాక్, మార్స్ ఆరేంజ్ షేడ్ కలర్స్‌లో లభిస్తాయి. జూలై ఆరో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రీ-ఆర్డర్లు బుక్ చేసుకోవచ్చు. రియల్మీ నార్జో60 5జీ ఫోన్‌పై రూ.1,500 డిస్కౌంట్, వెనీలా రియల్మీ నార్జో60 5జీ ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.
రెండు మోడల్ ఫోన్లపై ఆరు నెలల వారంటీ ఆఫర్ చేస్తున్నది. రియల్మీ నార్జో60 సిరీస్ ఫోన్ల ధరలు రూ.17,999 నుంచి ప్రారంభం అవుతాయని తెలుస్తున్నది. రియల్ మీ నార్జో60 సిరీస్ ఫోన్లు కర్వ్డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఐ ప్రొటెక్షన్ కోసం 2160 పల్స్ విడ్త్ మాడ్యులేషన్ (పీడబ్ల్యూఎం) తో వస్తున్నది.