Realme GT Neo 3T | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. తన కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్-2023 (Flipkart Big Savings Days Sale 2023) సందర్భంగా `రియల్మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3T)పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి తెచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ.29,999. కానీ, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్స్ ఆఫర్లో భాగంగా రూ.10 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. అంటే రూ.19,999లకే రియల్మీ జీటీ నియో 3టీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభం అవుతున్నది.
6.62-అంగుళాల ఫుల్ హెచ్డీ + 1,080×2,400 పిక్సెల్స్ రిజొల్యూషన్, ఈ4 అమోలెడ్ డిస్ప్లే విత్ 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో రియల్మీ జీటీ నియో 3టీ వచ్చింది. ఇది స్నాప్‌డ్రాగన్ 870 ఎస్వోసీ చిప్ సెట్ సపోర్ట్స్ 80 వాట్స్ సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ 12 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్.. డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో యూజర్లకు అందుబాటులో ఉంది.
రియల్మీ జీటీ నియో 3టీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. ఇది ఆండ్రాయిడ్ 12 వర్షన్ విత్ రియల్మీ యూఐ 3.0 స్కిన్ ఆన్ టాప్ వర్షన్‌పై పని చేస్తుంది. డిసెంబర్లో ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్మీ యూటీ 4.0తో అప్డేట్ చేశారు. స్నాప్ డ్రాగన్ 870 ఎస్వోసీ చిప్ సెట్ విత్ 8 జీబీ ఎల్పీడీడీఆర్4 ఎక్స్ రామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 ఇన్ బిల్ట్ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది.
ఫొటోలు, వీడియోల కోసం ట్రిపు్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.8 అపెర్చర్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ ఎఫ్/2.3 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా విత్ ఎఫ్/2.4 అపెర్చర్, సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం 16-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఎఫ్/2.45 అపెర్చర్ ఉన్నాయి.
వై-ఫై, 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీపోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్స్ 80వాట్స్ సూపర్ డార్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నది. కేవలం 12 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది.