Realme GT 6 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. శాంసంగ్, గూగుల్ తరహాలోనే ఏఐ-బేస్డ్ ఫీచర్లతోపాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తోంది. జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) ఫీచర్లతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ‘రియల్మీ జీటీ 6’ అని కంపెనీ తెలిపింది. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 808 ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, అమోలెడ్ డిస్ ప్లే విత్ ఫుల్ హెచ్డీ+ రిజొల్యూషన్‌తో వస్తున్నది. 120వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్.. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.40,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.42,999, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.44,999లకు లభిస్తుంది. ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ షేడ్స్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ వెబ్సైట్లోనూ, ఫ్లిప్కార్ట్లోనూ ఈ నెల 20 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 24 అర్ధరాత్రి 11.50 గంటల వరకూ ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్న కస్టమర్ల ఫోన్ స్క్రీన్ డ్యామేజీ ప్రొటెక్షన్ కలిగి ఉంటారు. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై రూ.4000 వరకూ ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.1000 వరకూ బోనస్ ఆఫర్ చేస్తున్న రియల్మీ.. 12 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందిస్తున్నది.
రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుంది. డోల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ మద్దతుతో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1264×2780 పిక్సెల్స్) 8టీ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతోపాటు 6000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోందీ ఫోన్. 4ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. కూలింగ్ ఎఫిషియెన్సీ పెంచడానికి 10014 ఎన్ఎం స్క్వేర్ 3డీ టెంపర్డ్ డ్యుయల్ వీసీ సిస్టమ్ ఉంటుంది.
రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 808 సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/1.69 అపెర్చర్ అండ్ ఓఐఎస్ సపోర్ట్, 50-మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్5 టెలిఫోటో సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఎఫ్/ 2.45 అపెర్చర్ తోపాటు 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. కెమెరా సెటప్ డోల్బీ విజన్ మద్దతుతో 30ఎఫ్‌పీఎస్ వద్ద 4కే వీడియో క్యాప్చరింగ్‌కు మద్దతుగా ఉంటుంది. డెడికేటెడ్ ఏఐ నైట్ విజన్ మోడ్ ఆఫర్ చేస్తుంది. ఏఐ స్మార్ట్ రిమూవల్, ఏఐ స్మార్ట్ లూప్ వంటి ఏఐ బేస్డ్ ఫీచర్లు ఉంటాయి.
రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్ బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, వై-ఫై 6 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. హెచ్ఐ రెస్ సర్టిఫికెట్ తోపాటు ఈ పోన్ ఎక్స్ -యాక్సిస్ లీనియర్ మోటార్ కలిగి ఉంటుంది. డ్యుయల్ మైక్రో ఫోన్లతోపాటు స్మార్ట్ ఫోన్ అన్ లాకింగ్, సెక్యూరిటీ, బయో మెట్రిక్ అథంటికేసన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
120 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్ వస్తోంది. 10 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ కాగల కెపాసిటీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ టెక్నాలజీ లక్ష్యం. కేవలం 28 నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అవుతుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే 48 గంటల టాక్ టైం, పబ్జీ గేమ్ ప్లేకు ఎనిమిది గంటల బ్యాటరీ లైఫ్ మద్దతు ఉంటుంది.