Realme GT 6 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్ను ఈ నెల 20న భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ (Qualcomm Snapdragon 8s Gen 3 Chipset)తోపాటు గేమింగ్ సెషన్లలో ఓవర్ హీటింగ్ సమస్యను అధిగమించడానికి డ్యుయల్ వీసీ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంటుందని రియల్మీ ధృవీకరించింది. 120వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ బ్యాటరీ 10 నిమిషాల్లో 50 శాతం, 28 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవతుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే 46 గంటల టాక్ టైం, ఎనిమిది గంటల పబ్జీ గేమింగ్ కు అనుకూలంగా ఉంటుంది.
రియల్మీ జీటీ 6 నియో ఫోన్ను రీ బ్రాండ్ చేసి రియల్మీ జీటీ 6 ఫోన్ ఆవిష్కరిస్తున్నారని తెలుస్తోంది. రియల్మీ జీటీ 6 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఓఐఎస్ మద్దతుతో 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా ఉంటుంది.
అధికారికంగా రియల్మీ తన రియల్మీ జీటీ 6 ఫోన్ ధర వెల్లడించకున్నా.. రియల్మీ జీటీ నియో 6 ఫోన్ ధర స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు. జీటీ నియో 6 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.24,200 (2099 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.27,500 (2399 చైనా యువాన్లు) పలుకుతోంది.