Realme GT 6 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ జీటీ6 ఫోన్ను భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఈ నెల 20న ఆవిష్కరించనున్నది. రియల్మీ జీటీ నియో 6 ఫోన్ను రీ బ్యాడ్జి చేసి రియల్మీ జీటీ 6 ఫోన్ గా తీసుకొస్తున్నారు. గత నెలలోనే చైనా మార్కెట్లో రియల్మీ జీటీ నియో 6 ఫోన్ ఆవిష్కరించారు.
రియల్మీ జీటీ 6 ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ సెట్, 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. పది నిమిషాల్లో 50 శాతం, 28 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ కోసం ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. డ్యుయల్ వీసీ కూలింగ్ సిస్టమ్తో వస్తుందీ ఫోన్. అంబియెంట్ లైట్ సెన్సర్ కూడా ఉంటుంది.
రియల్ మీ జీటీ 6 ఫోన్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోందీ ఫోన్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.