Realme 12 Pro 5G Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను ఈ నెలాఖరులో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రియల్మీ12 ప్రో 5జీ సిరీస్‌లో రియల్మీ12 ప్రో, రియల్మీ12 ప్రో+ ఫోన్లు ఉంటాయి. రియల్మీ11 ప్రో, రియల్మీ11 ప్రో+ ఫోన్లకు కొనసాగింపుగా ఈ ఫోన్లు వస్తున్నాయి. ఈ నెల 29 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్లు ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. రియల్మీ12 ప్రో+ వేరియంట్లో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుందని ధ్రువీకరించింది. బ్యాక్ ప్యానెల్‌పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ విత్ గోల్డెన్ డయల్ ఉంటుంది. సబ్ మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్‌తోపాటు ఎక్స్‌ప్లోరర్ రెడ్ షేడ్ కలర్లో ఈ ఫోన్ వస్తుంది.
రియల్మీ12 ప్రో+ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇక రియల్మీ12 ప్రో ఫోన్ నేవిగేటర్ బీగ్, సబ్ మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్లతోపాటు 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో వస్తుంది.
రియల్మీ12 ప్రో సిరీస్ ఫోన్లు ఆప్టికల్ ఇమేజ్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్ కెమెరా వస్తాయని ఇప్పటికే ధ్రువీకరించారు. అయితే బేస్ రియల్మీ 12 ప్రో ఫోన్ 32-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, రియల్మీ 12 ప్రో+ వేరియంట్ ఫోన్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ మద్దతుతో ఓవీ64బీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం రియల్మీ 12 ప్రో ఫోన్ 16-మెగా పిక్సెల్, రియల్మీ 12 ప్రో+ ఫోన్ 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటాయి.
రియల్మీ 12 ప్రో+ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ, రియల్మీ 12 ప్రో ఫోన్ క్వాల్ కామ్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ 67 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటాయని చెబుతున్నారు. 6.7-అంగుళాల కర్వ్డ్ ఎడ్జ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్స్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 15 వర్షన్ పై పని చేస్తాయి. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్లు ఉంటాయని అంటున్నారు.