Realme 11 Pro+ | 10న మార్కెట్లోకి రియల్ మీ 11 ప్రో+ .. ఇవీ స్పెషిఫికేషన్స్
Real Me 11 Pro + | మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ 11 సిరీస్ ఫోన్లు వచ్చేనెల 10 ఎంటర్ కానున్నాయి.
Realme 11 Pro+ | ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్మీ 11 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ ముహూర్తం ఖరారైంది. రియల్ మీ 11 సిరీస్‌లోని రియల్ మీ 11, రియల్ మీ 11 ప్రో, రియల్మీ 11 ప్రో+ ఫోన్లు వచ్చేనెల 10న చైనా మార్కెట్లోకి ఎంటరవుతాయి. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ చిప్సెట్తో రూపుదిద్దుకున్నాయి. ఓక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ విత్ 6జీబీ రామ్ వేరియంట్‌గా వస్తుంది. భారత్ మార్కెట్లో దీని ధర రూ.28,990గా ఉండొచ్చునని అంచనా.
సెంట్రల్లీ పొజిషన్డ్ హోల్ పంచ్ కటౌట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. రియల్మీ 11 ప్రో+ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ చెట్తో వస్తుందని సమాచారం. 6 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా రియల్మీ 11 ప్రో+ ఫోన్ అందుబాటులోకి రావచ్చునని తెలుస్తున్నది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో దీని ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఒక టిగాబైట్ వరకు పెంచుకోవచ్చు.
డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీలూ వీడియో రికార్డింగ్ ల కోసం ఫ్రంట్ లో 16 మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్ యూఎస్బీ- సీ పోర్ట్ తో వస్తున్నది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది.
గతేడాది నవంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన రియల్మీ 10 ప్రో+ కొనసాగింపుగానే రియల్ మీ 11 ప్రో+ వస్తున్నది. రియల్మీ 10 ప్రో+ ఫోన్ కూడా 6.7-అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రీ ఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో వచ్చింది. రియల్ మీ 10 ప్రో+ ఫోన్ ఓక్టాకోర్ 6 ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 1080 5జీ ఎస్వోసీ చిప్ సెట్, 80 జీబీ ఎల్పీడీడీఆర్4 ఎక్స్ రామ్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 11 pro+
- Business news
- real me
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

