Realme 11 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. భారత్ మార్కెట్లో తన రియల్మీ11 5జీ, రియల్మీ11ఎక్స్ 5జీ ఫోన్లను త్వరలో ఆవిష్కరించనున్నది. ఇటీవలే ఈ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది.
రియల్మీ11 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ చిప్ సెట్, 108-మెగా పిక్సెల్స్ రేర్ కెమెరాతో వస్తున్నదని తెలుస్తున్నది. చైనా మార్కెట్లో ఆవిష్కరించిన రియల్మీ11 5జీ ఫోన్‌తో పోలిస్తే కాస్త విభిన్నంగా ఉండొచ్చునని సమాచారం. గ్లోరీ హలో డిజైన్‌తో ఈ రెండు ఫోన్లు వస్తాయని భావిస్తున్నారు. కానీ భారత్ మార్కెట్లో ఆవిష్కరణ తేదీ మాత్రం వెల్లడించలేదు.
రియల్మీ11 5జీ ఫోన్ మీడియా టెక్ 6ఎన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ తో వస్తున్న ఫోన్ 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుంది. 6.72 -అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
108-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 -మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌కు 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. భారత్ మార్కెట్లో ఆవిష్కరించే రియల్మీ 11 5జీ ఫోన్ ధర ఇంకా వెల్లడించలేదు.