Realme 11 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. భారత్ మార్కెట్లో తన రియల్మీ11 5జీ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. దీంతోపాటు రియల్మీ11ప్రో 5జీ, రియల్మీ11ప్రో+ 5జీ ఫోన్లు కూడా ఆవిష్కరిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో ఆవిష్కరించిన రియల్మీ11 5జీ ఫోన్ ఒక్టాకోర్ 7ఎన్ఎం బేస్డ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 5జీ ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్నది.
108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ హెచ్ఎం6 సెన్సర్ విత్ ఇన్ సెన్సర్ 3ఎక్స్ జూమ్ సపోర్ట్, 2-మెగా పిక్సెల్ పొర్ట్రైట్ సెన్సర్, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 17 నిమిషాల్లో 50 శాతం, 47 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. 67వాట్ల వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నది.
భారత్ మార్కెట్లో ఆవిష్కరించే రియల్మీ11 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్ మీ యూఐ 4.0 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుందని భావిస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం 8 జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా వస్తుందని తెలుస్తున్నది.
రియల్మీ11 5జీ ఫోన్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. ఇది 5జీ, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లూటూత్, బైదూ, గలిలియో, గ్లోనాస్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
చైనాలో విడుదలైన రేట్ల ప్రకారం రియల్మీ11 5జీ ఫోన్ 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.18,000 (1599 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.20,600 (1799 చైనా యువాన్లు) పలికింది.