Repo Rate effect on Home Loans | కీలక వడ్డీరేట్లు 40 బేసిక్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ తన ఆఫ్సైకిల్ పాలసీ సమీక్షలో నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 21 నుంచి క్యాష్ రిజర్వు నిష్పత్తి 50 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కీలక వడ్డీరేట్లు పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరిచింది. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారి మదుపులపై వడ్డీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
కానీ రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంటి రుణాలతోపాటు అన్ని రకాల లోన్లపై వడ్డీరేట్లు పెరుగుతాయి. ఇతరులకు (మహిళలు మినహా) ఎస్బీఐ ఇచ్చే ఇంటి రుణాలపై వడ్డీరేట్ల ఆధారంగా ఒక్కో ఉద్యోగి లేదా రుణ గ్రహీతపై నెలవారీ ఎంత భారం పడుతుందో తెలుసుకుందాం..
రుణం ———— గడువు —– ప్రస్తుత వడ్డీరేటు/ ఈఎంఐ —– కొత్త రేటు / కొత్త ఈఎంఐ – పెరిగిన భారం
రూ.30 లక్షలు — 20 ఏండ్లు — 6.75% / రూ. 22,811 ————— 7.15% / రూ. 23,530 —– రూ.719
రూ.50 లక్షలు — 20 ఏండ్లు — 7.00% / రూ. 30,018 ————– 7.00% / రూ.39,216 —– రూ.1,198
రూ. 75 లక్షలు — 20 ఏండ్లు — 6.75% / రూ. 57,027 ————– 7.15% / రూ.58,825 —— రూ.1,798