మరో పావు శాతం వడ్డింపు!
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగడంతో పాటు అమెరికా ఫెడ్‌తో సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లు కఠిన ద్రవ్య విధానాన్నే అవలంబించడంతో రిజర్వ్‌బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- ఆర్బీఐ ఏప్రిల్ పాలసీపై అంచనాలు
న్యూఢిల్లీ, మార్చి 27: దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగడంతో పాటు అమెరికా ఫెడ్‌తో సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లు కఠిన ద్రవ్య విధానాన్నే అవలంబించడంతో రిజర్వ్‌బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 6 వరకూ మూడురోజులపాటు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం కానుంది. ఈ సందర్భంగా రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. మూడు ప్రధాన కేంద్ర బ్యాంక్‌లు యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయాలను, రిటైల్ ద్రవ్యోల్బణం తీరును ఆర్బీఐ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే క్రమంలో 2022 మే నెల నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్న ఆర్బీఐ పావుశాతం పెంచుతుందని నిపుణులు అంటున్నారు. గత రెండు నెలల్లో ద్రవ్యోల్బణం అధికస్థాయిలో ఉన్నందున, ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లు పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ చెప్పారు. ఇదే అంచనాను ఇండియా రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ డీకే పంత్ వ్యక్తం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

