RBI FAQ-Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆంక్షల విషయమై ఫాక్ట్ షీట్ విడుదల చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. పీబీబీఎల్ కస్టమర్ల సేవలు, డిపాజిటర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సోమవారం ఆర్బీఐ పాలక మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన తర్వాత ఆయన ఈ సంగతి చెప్పారు.
నిరంతర కేవైసీ, నియంత్రణ పద్దతులను పాటించడంలో విఫలమైనందున ఈ నెల 29 తర్వాత డిపాజిట్ల సేకరణ, కస్టమర్లకు టాపప్ సేవలు, వాలెట్లు, ఫాస్టాగ్, ఇతర ఇన్స్ట్రుమెంట్ సేవలను నిలిపేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 29 తర్వాత గడువు పొడిగిస్తారా? అన్న అంశంపై శక్తికాంత దాస్ స్పందిస్తూ.. ‘ఫ్యాక్ట్ షీట్’ కోసం వేచి ఉండాలని కోరారు. ‘ఫ్యాక్ట్ షీట్’లో ఆర్బీఐ నిర్ణయాన్ని సమీక్షిస్తామని అంచనా వేయొద్దు. డిపాజిటర్లు, కస్టమర్లు, వాలెట్ యూజర్లు, ఫాస్టాగ్ ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి ఫ్యాక్ట్ షీట్ ఉపకరిస్తుంది. ఫ్యాక్ట్ షీట్లో కస్టమర్ల ప్రయోజనాలు ఎలా కాపాడాలన్న విషయంపైనే కేంద్రీకరిస్తామన్నారు.