RBI | మూడు బ్యాంకులపై రూ.10.34 కోట్ల జరిమాన విధించిన ఆర్బీఐ.. ఇవీ కారణాలు..!
RBI | సిటీ బ్యాంకుతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు రూ.10.34 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వేర్వేరు ప్రకటనల్లో తెలిపింది.
RBI | రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమైన నేపథ్యంలో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లపై రూ.10.34 కోట్ల జరిమాన విధించింది.
డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ స్కీం కింద నిబంధనలు పాటించకపోవడంతో సిటీ గ్రూపుపై అత్యధికంగా రూ.5 కోట్ల జరిమాన విధించింది. సిటీ బ్యాంకు గ్రూప్ ఔట్ సోర్సింగ్ ఫైనాన్సియల్ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక `సెంట్రల్ రిపోసిటరీ ఆఫ్ లార్జ్ కామన్ ఎక్స్ పోజర్స్ అండ్ అదర్స్`నిబంధన పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ.4.34 కోట్ల పెనాల్టీ విధించినట్లు మరో ప్రకటనలో వెల్లడించింది.
రుణాలు, అడ్వాన్సుల మంజూరు విషయంలో నిబంధనలు, మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించినందుకు మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌పై రూ.కోటి ఫైన్ విధించింది ఆర్బీఐ. మూడు బ్యాంకులు కూడా రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకే జరిమాన విధించినట్లు స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

