ముంబై, జూలై 17 : ముత్తూట్ ఫైనాన్స్‌తోపాటు మరో ఐదు సంస్థలపై రిజర్వుబ్యాంక్ కన్నెర్ర చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినందుకుగాను ముత్తూట్ ఫైనాన్స్‌పై రూ.5.80 లక్షలు, సత్యా మైక్రోక్యాపిటల్, పాన్ ఇమామీ కాస్మెడ్లపై రూ.3.10 లక్షలు, ధాని లోన్స్ అండ్ సర్వీసెస్, ముత్తూట్ వెహికల్ అండ్ అసెట్ ఫైనాన్స్‌పై రూ.2.70 లక్షలు, అవైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై రూ.6.20 లక్షల జరిమానా పడింది.