న్యూఢిల్లీ, జూలై 8: మరో రెండు బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వుబ్యాంక్ షాకిచ్చింది. అక్రమ రుణ పద్దతుల కారణంగా స్టార్ ఫిన్సర్వ్ ఇండియాతోపాటు మరో సంస్థ పాలీటెక్స్ ఇండియా లైసెన్స్‌లను రద్దు చేసింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్ ఫిన్సర్వ్ ఇండియా ప్రొగ్క్యాప్, అలాగే ముంబై కేంద్రస్థానంగా పాలీటెక్స్ ఇండియా కార్యకలాపాలు అందిస్తున్నాయి.
అవుట్సోర్సింగ్ ద్వారా డిజిటల్‌గా రుణాలు మంజూరు, వసూళ్లు నిర్వహించినందుకుగాను స్టార్ ఫిన్‌సర్వ్‌కి చెందిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. కేవైసీ ధృవీకరణ ప్రక్రియ కూడా అవుట్సోర్సింగ్ ఇవ్వడం ఆర్బీఐ అభ్యంతరాలు వ్యక్తంచేసింది.