RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ఆర్బీఐ వెల్లడించింది. కొత్తగా విడుదల చేయనున్న నోట్ల డిజైన్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో జారీ చేసిన రూ.100, రూ.200 నోట్లన్నీ చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. మొన్నటి వరకు ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ పని చేసిన విషయం తెలిసిందే. ఆయన పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 2024లో ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ మహాత్మా గాంధీ కొత్త సిరీస్లో రూ.50 కొత్త నోట్లను జారీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. కొత్త ఆర్బీఐ గవర్నర్ సంతకంతో ఈ నోట్లు చెలామణిలోకి రానున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా శక్తికాంత దాస్ పేరిట ప్రింట్ అయిన నోట్లు చెలామణి అవుతున్నాయి.