RBI Key interest Rates | చౌకగానే ఇండ్ల రుణాలు.. వడ్డీరేట్లు యథాతథం..!
RBI Key interest Rates | కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
RBI Key interest Rates | ఆర్థిక కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. వరుసగా 11 సార్లు ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడం వల్ల ఇండ్ల కొనుగోలుదారులకు చౌక వడ్డీరేట్లకే హోంలోన్లు లభించనున్నాయి. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ముగిసిన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని తీర్మానించింది. రెపో, రివర్స్రెపో రేట్లతోపాటు అన్ని రకాల వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయి.
మే 2020న 4 శాతానికి రెపోరేట్
ఇంతకుముందు 2020 మే 22న చివరిసారిగా రెపోరేటు నాలుగు శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అప్పుడే రివర్స్ రెపోరేట్ కూడా 40 బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో వడ్డీరేట్లు పెంచకుండా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించడం గమనార్హం.
రెపోరేట్, రివర్స్ రెపోరేట్ ఇలా
రెపోరేట్ (షార్ట్ టర్మ్ రుణ పరపతి వడ్డీరేటు) 4 శాతంగానూ, రివర్స్ రెపోరేట్ 3.35 శాతంగానూ ఉంటుంది. అంటే వివిధ బ్యాంకుల్లో ఖాతాదారులు జమచేసే డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేటే రివర్స్ రెపోరేటు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమావేశం కావడం ఇదే తొలిసారి.
రుణాల ద్వారా రూ.8.45లక్షల కోట్లకు కేంద్రం ప్లాన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రుణాల ద్వారా 60 శాతం నిధులు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అంటే రూ.8.45 లక్షల కోట్ల మేరకు రుణాల రూపంలో సేకరించాలని కేంద్రం ప్రణాళిక. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.24 లక్షల కోట్ల రుణాలను సేకరించింది. ఈ నిధుల సేకరణకు ఆర్బీఐ బాండ్ల విక్రయాలు చేపట్టనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

