ముంబై, జూలై 3 : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లకు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. న్యాయమైన విధానాల నియమావళి, కేవైసీ నిబంధనలోని కొన్ని అంశాలను పాటించకపోవడంతో బీవోబీపై రూ.63.6 లక్షలు జరిమానా విధించిన సెంట్రల్ బ్యాంక్..జీఐసీపై రూ.3.1 లక్షలు విధించింది.
ఖాతాదారుడితో బీవోబీ నిర్దిష్ట రుణ ఖాతాలపై ఒప్పందం కుదుర్చుకున్న వడ్డీరేటు కంటే అధిక వడ్డీని వసూలు చేసినట్టు ఆర్బీఐ గుర్తించింది. దీంతో బీవోబీ ఈ భారీ జరిమానా విధించింది.