RBI | ముంబై, నవంబర్ 3: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు మూడు ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. పీఎన్బీపై రూ.72 లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ..ఫెడరల్ బ్యాంకుపై రూ.30 లక్షల జరిమానా విధించింది.
అలాగే మెర్సిడెజ్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై కూడా రూ.10 లక్షల జరిమానా వేసింది. పీఎన్బీ విషయానికి వస్తే అడ్వాన్స్‌లపై వడ్డీరేట్లు, ఖాతాదారులకు సరైన విధంగా సేవలు అందించకపోవడం వల్లనే జరిమానా విధించింది. కోసమట్టమ్ ఫైనాన్స్‌పై రూ.13.38 లక్షలు జరిమానా వేసింది.