ముంబై, ఏప్రిల్ 6 : బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ప్రత్యేక విభాగంగా గుర్తించడానికి రిజర్వు బ్యాంక్ కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు కూడా చేసింది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో కీలకంగా మారిన బిజినెస్ కరస్పాండెంట్లను ప్రత్యేకంగా గుర్తించడంతోపాటు వారికి ఫిక్స్డ్ వేతనం ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక ముసాయిదాను విడుదల చేసింది.
వీరిని మూడు భాగాలుగా గుర్తించనున్నట్టు, వీరిలో బ్యాంక్ శాఖల వద్ద, బిజినెస్ కరస్పాండెంట్-బ్యాంకింగ్ అవుట్లెట్, బిజినెస్ కరస్పాండెంట్-బ్యాంకింగ్ టచ్పాయింట్ల వద్దగా గుర్తించనున్నది. బ్యాంకింగ్ కార్యకలాపాలు లేనిచోట ఆయా సంస్థలు బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకునేందుకు అక్కడి శాఖలకు అవకాశం కల్పించింది. సామాన్యులకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంక్ వీరి నియామకానికి గతంలోనే పచ్చజెండా ఊపింది.