హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను నూతన అధ్యక్షుడిగా ప్రముఖ టెక్నోక్రాట్ రాచకొండ రవికుమార్, ఉపాధ్యక్షుడిగా కేకే మహేశ్వరి ఎన్నికైనట్టు ఎఫ్టీసీసీఐ తెలిపింది.
రవికుమార్ ప్రస్తుతం జెటాటెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా, కేకే మహేశ్వరి సీఐఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సీఎండీగా సేవలందిస్తున్నారని పేర్కొన్నది.