Tata Nano EV | టాటా నానో (Tata Nano) కారు ఒక్కప్పుడు అంటే దాదాపు 14 ఏండ్ల క్రితం సామాన్య భారతీయ పౌరుడు కొనుగోలు చేసేందుకు అత్యంత చౌక ధరకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మనస్సులో పురుడు పోసుకున్నది.. మళ్లీ నూతన అవతార్‌లో అందరికీ అందుబాటులోకి వస్తున్నది. అదీ టాటా నానో.ఈవీ (Tata Nano.ev) రూపంలో వస్తోంది. ఇప్పటికైతే టాటా నానో.ఈవీ (Tata Nano.EV) కారు ఆవిష్కరణ తేదీ, దాని ధర వివరాలు, స్పెషిఫికేషన్స్పై టాటా మోటార్స్ (Tata Motors) అధికారికంగా ధృవీకరించకున్నా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో టాటా నానో.ఈవీ (Tata Nano.ev) కారుపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం అధిక ధరల మార్కెట్లో ఇతర కార్లతో పోటీ పడుతూ తక్కువ ధరకు ఈ కారు తేవడం టాటా మోటార్స్ ముందు ఉన్న పెద్ద సవాల్. ప్రారంభంలో రూ.లక్షకే అందుబాటులోకి వచ్చిన టాటా నానో కారు.. కొత్త అవతార్ లో టాటా నానో.ఈవీ కారు ధర రూ. 3 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని, హై ఎండ్ మోడల్ ధర రూ.ఏడెనిమిది లక్షలు ఉండొచ్చునని సమాచారం.
ఈ టాటా నానో.ఈవీ (Tata Nano.ev) కారు సింగిల్ చార్జింగ్ చేస్తే సుమారు 200-300 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దేశీయ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న టాటా మోటార్స్.. ఇప్పటి వరకూ భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ఇతర టాటా.ఈవీ కార్ల మాదిరిగానే టాటా నానో.ఈవీ (Tata Nano.ev) కారులోనూ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వినియోగిస్తారని సమాచారం. స్టాండర్డ్ ఏసీ చార్జింగ్, డీసీ ఫాస్ట్ చార్జింగ్ వసతులు కల్పిస్తారని టాటా మోటార్స్ వర్గాల కథనం. లగ్జరీ కార్లతో పోలిస్తే సదరు కారు ఫంక్షనింగ్‌కు ప్రియారిటీ ఇస్తూ బేసిక్ ఫీచర్లు జత చేస్తారని సమాచారం. ఇక ఇతర కార్లతో పోటీ పడేందుకు టాటా నానో.ఈవీ (Tata Nano.ev) కారు ధర నిర్ణయించడం టాటా మోటార్స్ (Tata Motors) ముందు ఉన్న అసలైన సవాల్.
ఎలక్ట్రిక్ నానో (Electric Nano) కారు కాన్సెప్ట్ కొత్తదేం కాదు. 2010లోనే టాటా మోటార్స్ (Tata Motors) తన నానో.ఈవీ కాన్సెప్ట్ (Nano.ev Concept) కారును ప్రదర్శించినా, వివిధ కారణాల రీత్యా ఉత్పత్తి వరకూ రాలేదు. దేశీయంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కార్లు, అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో టాటా మోటార్స్ (Tata Motors) మరోమారు ‘టాటా నానో.ఈవీ (Tata Nano.ev)’ మోడల్ కారు ఉత్పత్తిపై ఆసక్తి ప్రదర్శిస్తోంది.
అత్యధికంగా, విస్తృత స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు ‘టాటా నానో.ఈవీ (Tata Nano.ev)’ కారు అత్యంత చౌక ఎలక్ట్రిక్ కారు కానున్నది. నిత్యం రద్దీగా ఉండే నగరాల్లో యుక్తిగా నడిపేందుకు ఈ కారు కంపాక్ట్ సైజ్ ఐడియల్ కానున్నదని తెలుస్తోంది. నానో.ఈవీ కారు వల్ల వాయు కాలుష్యం తగ్గడంతోపాటు సుస్థిరతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
జయం ఆటోమేటివ్స్ (Jayem Automotives) సహకారంతో టాటా మోటార్స్ (Tata Motors).. తన నానో (Nano Platform) ప్లాట్‌ఫామ్‌పై ‘జయం నియో’ అనే పేరుతో ఈవీ కారును అభివృద్ధి చేస్తోంది. అంతే కాదు పరిమితంగానే ‘జయం నియో’ కార్లను తయారు చేస్తుందని సమాచారం.
టాటా నానో ప్లాట్ ఫామ్ మీద వస్తున్న జయం నియో (Jayem Neo) అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా ఎలక్ట్రిక్ వెహికల్ సేఫ్టీ కీలకం కానున్నది. ఇప్పటికీ భారత్ లో ఈవీ ఇన్ ఫ్రాచార్జింగ్ వసతులు అభివృద్ధి దశలోనే ఉన్నాయి. దీనివల్ల విస్తృత ప్రాతిపదికన టాటా నానో.ఈవీ కారును ప్రతి ఒక్కరూ ఎంచుకోవడం అంత తేలికేం కాదని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్ సంస్థలు సైతం ఈవీ వెహికల్స్ తయారీపై ఫోకస్ పెడుతుండటంతో టాటా నానో.ఈవీకి ఇతర సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చునని భావిస్తున్నారు.