Rapido | ఆన్లైన్ ఫుడ్ బిజినెస్‌లోకి ర్యాపిడో.. తక్కువ కమీషన్లతో స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెఢీ..!
Rapido | ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ర్యాపిడో (Rapido) కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Rapido | ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ర్యాపిడో (Rapido) కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ (Online Food Delivery Market) రంగంలోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెఢీ అయినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్లో దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ విభాగంలో ఎన్ని సంస్థలు ఉన్నా వాటిని వెనక్కి నెట్టి మొదటి రెండు స్థానాల్లో రాణిస్తూ.. మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ర్యాపిడో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పలు రెస్టారెంట్ల నిర్వాహకులతో సంస్థ ప్రతినిధులు సమావేశం అయినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా నివేదిస్తోంది. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జూన్ చివరి నాటికి లేదా జులై ప్రారంభంలో బెంగళూరులో డ్రైరన్ ఉంటుందని సమాచారం.
ఆర్డర్ విలువ ఆధారంగా రెస్టారెంట్ల నుంచి ర్యాపిడో 8 నుంచి 15 శాతం కమీషన్లు వసూలు చేస్తుందని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు (Offering Lower Restaurant Commissions). రూ.400 కంటే తక్కువ ఆర్డర్లపై రూ.25, రూ.400 కంటే ఎక్కువ ఆర్డర్లపై రూ.50 రుసుముగా వసూలు చేయనున్నట్లు సమాచారం. జొమాటో, స్విగ్గీతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ. ప్రస్తుతం ఆ రెండు సంస్థలూ 16 నుంచి 30 శాతం వరకూ రెస్టారెంట్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నాయి.
2015లో ర్యాపిడో క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 100కుపైగా నగరాల్లో ర్యాపిడో బైక్, ఆటో, ఆటో షేర్, క్యాబ్ సేవలను అందిస్తోంది. 2025 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 500 నగరాలకు తమ క్యాబ్ సేవలను విస్తరించాలని ర్యాపిడో కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి సైతం ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Also Read..
Errol Musk | నా కుమారుడు మస్క్‌పై ట్రంపే గెలుస్తారు : ఎర్రోల్ మస్క్
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. గాయపడిన వారికి నోటీసులు జారీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

