హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సింగరేణితో కలిసి ‘రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ కంపెనీ’ నెలకొల్పనున్న 2300 మెగావాట్ల సోలార్, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి హీరాలాల్నాగర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఉమ్మడి విద్యుత్తు ప్రాజెక్టులపై చర్చించారు.
సింగరేణి, రాజస్థాన్ సర్కారు చేపడుతున్న ఈ విద్యుత్తు ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల పురోగతికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజస్థాన్‌కు చెందిన కాలూరామ్, ప్రమోద్‌శర్మ, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఈడీ చిరంజీవి, జీఎం (కో ఆర్డినేషన్) టీ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.