27 నుంచి రెయిన్బో ఐపీవో
చిన్న పిల్లల ఆసుపత్రుల నిర్వహణ సంస్థ రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ లిమిటెడ్..ఈ నెల 27 నుంచి ఐపీవోకి రాబోతున్నది. షేర్ల విక్రయం ద్వారా రూ.2 వేల కోట్ల నిధులను సేకరించాలనే సంకల్పంతో మూడు రోజులపాటు వాటాలను విక్రయించనున్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: చిన్న పిల్లల ఆసుపత్రుల నిర్వహణ సంస్థ రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ లిమిటెడ్..ఈ నెల 27 నుంచి ఐపీవోకి రాబోతున్నది. షేర్ల విక్రయం ద్వారా రూ.2 వేల కోట్ల నిధులను సేకరించాలనే సంకల్పంతో మూడు రోజులపాటు వాటాలను విక్రయించనున్నది. ఈ నెల 29న ఈ ఐపీవో ప్రక్రియ ముగియనున్నదని తెలిపింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 26ని రిజర్వు చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.280 కోట్ల నిధులను సమీకరించనున్న సంస్థ..2.4 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నది. కంపెనీ ప్రమోటైర్లెన రమేశ్ కంచర్ల, దినేశ్ కుమార్ చీర్లా, ఆదర్శ్ కంచర్ల, పద్మ కంచర్ల, ఇన్వెస్టర్ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్, సీడీసీ ఇండియాకు చెందిన షేర్లను విక్రయించనున్నారు. అర్హులైన ఉద్యోగులకు 3 లక్షల షేర్లను కేటాయించింది సంస్థ. ప్రస్తుతం కంపెనీకి 14 ఆసుపత్రులు, మూడు క్లినిక్లు ఉన్నాయి. లీడ్ మేనేజర్లుగా కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, జేపీ మోర్గాన్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీలు వ్యవహరిస్తున్నాయి. ఈక్విటీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్కానున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

