ముంబై, ఏప్రిల్ 20: ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ర్యాడిసన్ హోటల్ గ్రూపు వచ్చే ఐదేండ్లలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమైంది. 2030 నాటికి తన హోటళ్ల సంఖ్యను 500కి పెంచుకోవడం ద్వారా కొత్తగా 65 వేల నుంచి 80 వేల మందికి ఉపాధి కల్పించేయోచనలో ఉన్నట్లు హోటల్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ చీఫ్ డెవలప్మెంట్ అధికారి ఎలియా యూనెస్ తెలిపారు.
అంతర్జాతీయ దేశాల్లో భారత్ మూడో అతి కీలకమైన మార్కెట్ అని, వచ్చే ఐదేండ్లలో ఇక్కడ హోటళ్ల సంఖ్యను 500కి పెంచుకోవాలనుకుంటున్నట్టు, దీంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయన్నారు. బెల్జియం కేంద్రంగా హాస్పిటాల్టీ సేవలు అందిస్తున్న ఈ సంస్థ..ఇప్పటికే ర్యాడిసన్ అకాడమితోపాటు హాస్పిటాల్టీ స్కిల్ కౌన్సిల్, ప్రాంతీయ యూనివర్సిటీలు, ప్రభుత్వాల ద్వారా ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం భారత్లో ర్యాడిసన్ గ్రూపు 200 ప్రాపర్టీలను నిర్వహిస్తున్నది.